close
NewsPolitics

MEE TV NEWS UPDATE 09.02.2024 || 2:00 pm II @Mee_Tv_News

#meetvnews #telugunews #latesttelugunews
MEE TV NEWS UPDATE 09.02.2024 || 2:00 pm II @Mee_Tv_News

News 1
హైదరాబాద్ GHMC మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ BRS పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా మున్షీ సమక్షంలో బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో BRS పార్టీకి భారీషాక్ తగిలింది. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీరుపై బాబా ఫసియుద్దీన్ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో ప్రాధాన్యం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో BRS పార్టీ ఖాళీ అయిపోతుంది.

News 2
సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్ లో శుక్రవారం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూని యర్ బాలురు, బాలికల జిల్లా జట్లకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి M.రవికుమార్ తెలిపారు. జట్టుకు ఎంపికైన క్రీడా కారులు ఈ నెల 16 నుంచి 19 వరకు సూర్యా పేటలో నిర్వహించే 33వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో జిల్లా తరపున పాల్గొంటారని తెలిపారు.

News 3
రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ శిల్ప, వార్డ్ కౌన్సిలర్ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో APIIC చైర్మన్, నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి శుక్రవారం పర్యటించారు. ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడప వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న సంక్షేమ పథకాల రారాజు CM జగనన్నను మరోసారి CM గా ఆశీర్వదించాలని విజ్ఞప్తించారు.

News Chapters
0:00 Intro
0:13 News 1 బాబాఫసియుద్దీన్ BRS పార్టీకి రాజీనామా చేశారు
0:51 News 2 సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్ లో
1:21 News 3 రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని

Leave a Response